కొత్త లేబర్ కోడ్ల అమలుపై మల్లికార్జున ఖర్గే విమర్శలు
కొత్త లేబర్ కోడ్ల అమలుపై మల్లికార్జున ఖర్గే విమర్శలు
Kharge


న్యూఢిల్లీ, 11 మే (హి.స.)

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన

నాలుగు కొత్త లేబర్ కోడ్ల అమలుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే Mallikarjuna Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూసిన మోడీ ప్రభుత్వం (Modi Govt.), గత వారం (మే 8, 9 తేదీల్లో) గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను దొంగచాటుగా అమల్లోకి తెచ్చిందని ఆయన విమర్శించారు. ఈ కొత్త కోడ్లు దేశంలోని కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాస్తాయని, 'హైర్ అండ్ ఫైర్' (ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడం, తీసివేయడం) ప్రోత్సహిస్తాయని ఆయన ఆరోపించారు. విధానాన్ని

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున 'శ్రామిక్ న్యాయ్' (Shramik Nyay) పేరుతో ఐదు పాయింట్ల ఎజెండాను ఖర్గే ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) పట్టణ ప్రాంతాలకు విస్తరించడం, కనీస వేతనాన్ని రోజుకు రూ.400కి పెంచడం, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం మరియు అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు నియామకాలను నిలిపివేస్తామని, మోదీ ప్రభుత్వం నీరుగార్చిన కార్మిక చట్టాలను తిరిగి సమీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande