న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం: 'వన్ కేస్, వన్ డేటా' విధానాన్ని ప్రకటించిన సీజేఐ
న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం: 'వన్ కేస్, వన్ డేటా' విధానాన్ని ప్రకటించిన సీజేఐ
Supreme court


న్యూఢిల్లీ, 11 మే (హి.స.)

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల కేసుల డేటాను ఒకే గొడుగు కిందకు తెచ్చే లక్ష్యంతో సుప్రీంకోర్టు (Supreme Court) సరికొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. ఇవాళ కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ప్రతిష్టాత్మకమైన 'వన్ కేస్ వన్ డేటా' (One Case, One Data) విధానంతో పాటు 'సు-సహాయ్' (Su-Sahay) అనే ఏఐ ఛాట్బాట్ను ఆవిష్కరించారు.

భారత్లో ఉన్న వివిధ కోర్టుల మధ్య సమాచార అంతరాన్ని తగ్గించడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. దీంతో ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల డేటా అంతా లింక్ చేయనున్నారు. ఒక కేసు కింది కోర్టు నుంచి పై కోర్టుకు వెళ్లినప్పుడు, ఆ కేసు పూర్తి వివరాలు, పూర్వాపరాలను అధికారులు, న్యాయమూర్తులు సులభంగా యాక్సెస్ చేయవచ్చు. కేసుల ప్రస్తుత స్థితి వెరిఫై చేయడం ఇప్పుడు మరింత వేగవంతం, సులభం కానుంది. భారతదేశ చరిత్రలో ఇలాంటి సమగ్ర డేటా ఇంటిగ్రేషన్ జరగడం ఇదే తొలిసారి అని సీజేఐ సూర్యకాంత్ (CJI Suryakant) పేర్కొన్నారు.

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సహకారంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభివృద్ధి చేసిన 'సు-సహాయ్' అనే ఏఐ ఆధారిత అసిస్టెన్స్ ఛాట్బాట్ను కూడా సీజేఐ ప్రారంభించారు. අධි సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. కక్షిదారులు (Litigants), న్యాయవాదులు సుప్రీంకోర్టు సేవలను ఎలా పొందాలో, గైడ్లైన్స్ ఏమిటో తెలుసుకోవడానికి ఈ ఛాట్బాట్ సులభమైన ఇంటర్ఫేసన్ను అందించనుంది. సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల న్యాయ ప్రక్రియలో జాప్యం తగ్గుతుందని, న్యాయం అందరికీ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల సిక్కింను దేశంలోనే మొట్టమొదటి 'పేపర్స్ జుడిషియరీ'గా ప్రకటించిన సీజేఐ, ఇప్పుడు దేశవ్యాప్త డేటా ఇంటిగ్రేషన్తో మరో ముందడుగు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande