గ్రామీణ ఉపాధిలో కొత్త శకం. 'వికసిత్ భారత్-G RAM G' అమలు
గ్రామీణ ఉపాధిలో కొత్త శకం. 'వికసిత్ భారత్-G RAM G' అమలు
Shivraj


భోపాల్ (ఎంపీ), 11 మే (హి.స.)

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

తీసుకువచ్చిన 'వికసిత్ భారత్-G RAM G' (Viksit Bharat-G RAM G) చట్టం అమలుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్ లోని బోపాల్ వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కొత్త చట్టం జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కోరుకునే పౌరులకు ఇకపై ఏడాదికి 100 రోజులకు బదులుగా 125 రోజుల పాటు పని కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏకంగా రూ. 95,692 కోట్లను కేటాయించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో ఈ కొత్త చట్టం రానుంది. జూలై 1న ఈ చట్టం ప్రారంభమయ్యే వరకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయని, పెండింగ్లో ఉన్న పనులన్నీ ఉపాధి హామీ కింద పూర్తి చేయాలని మంత్రి స్పష్టం రాష్ట్రాలకు ఈ కొత్త వ్యవస్థకు మారడానికి ఆరు నెలల సమయం ఉంటుందని, అయితే చేశారు. చాలా జూలై 1 తర్వాత ఏ రాష్ట్రమైనా సిద్ధంగా లేకపోయినా, నిధుల మంజూరు మాత్రం 'వికసిత్ భారత్-G RAM G' పథకం నిబంధనల ప్రకారమే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande