ఐపీఎల్ లో నేడు గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్.. గెలిచిన జట్టుకి టాప్ ప్లేస్..
అహ్మదాబాద్, 12 మే (హి.స.) ఐపీఎల్ 2026లో ఇవాళ మరో కీలక మ్యాచ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంటుంది. 16 పాయింట్స్ తో దాదాపు ప్లే
Ipl


అహ్మదాబాద్, 12 మే (హి.స.)

ఐపీఎల్ 2026లో ఇవాళ మరో కీలక

మ్యాచ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంటుంది. 16 పాయింట్స్ తో దాదాపు ప్లే ఆఫ్స్ స్థానం ఖరారు చేసుకుంటుంది. రెండు జట్ల బ్యాటర్లు భయంకరమైన ఫామ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ లలో ఏడు విజయాలతో హైదరాబాద్, అటు గుజరాత్, RCB 14 పాయింట్స్ సాధించాయి. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగుళూరు మొదటి స్థానంలో ఉంది. ఇవాళ గెలిచిన జట్టు టాప్ లోకి వెళ్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande