ఐదు దేశాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ..షెడ్యూల్ ఇదే
న్యూఢిల్లీ, 12 మే (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆరు రోజుల పాటు ఏకంగా ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా యూఏఈకి ఈ నెల 15వ తేదీన పయనం అవుతారు. మే 15వ తేదీ సాయంత్రం నుంచి 17 తేదీ వరకు నెదర్లాండ్స
Pm


న్యూఢిల్లీ, 12 మే (హి.స.)

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విదేశీ

పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆరు రోజుల పాటు ఏకంగా ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా యూఏఈకి ఈ నెల 15వ తేదీన పయనం అవుతారు. మే 15వ తేదీ సాయంత్రం నుంచి 17 తేదీ వరకు నెదర్లాండ్స్ లో పర్యటిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక 17వ తేదీ నుంచి 18 వరకు స్వీడన్ పర్యటన కొనసాగుతుంది.

అనంతరం 18, 19 తేదీలలో నార్వేలో పర్యటిస్తారు. చివరగా ఈ నెల 20వ తేదీన ఇటలీకి వెళ్లనున్నారు. ఈ అంటే మొత్తంగా 6 రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఐదు కంట్రీల పర్యటన నేపథ్యంలో ఆయా దేశాల అధినేతలతో భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోడీ... ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపనున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande