
బెంగళూరు 12 మే (హి.స.), : కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్ను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీ కొట్టింది. అనంతరం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ