
ఢిల్లీ, 13 మే (హి.స.)
నీట్-యూజీ 2026 పరీక్షలో పేపర్ లీకేజీలు, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్-జీ (యువత) రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పిలుపునిచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 93 కంటే ఎక్కువ పరీక్ష పేపర్ లీజేకీ ఘటనలు జరిగాయన్నారు. దీని వల్ల 6కోట్లకు పైగా యువత ప్రభావితమయ్యారని ఆరోపించారు. తాజా నీట్-యూజీ పేపర్ లీకేజీల్లో సీనియర్ నాయకుల ప్రమేయం ఉందనే అర్థం వచ్చేలా కేజ్రీవాల్ మాట్లాడారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏవైనా దిద్దుబాటు చర్యలు తీసుకోగలదా? అని జెన్-జీని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi