
హైదరాబాద్, 13 మే (హి.స.)
లక్షలాది మంది విద్యార్థులు,
తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఈ సారి మొత్తం ఉత్తీర్ణత 85.20 శాతం నమోదైనట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పేర్కొంది. విద్యార్థులు తమ మార్క్ షీట్స్ ను అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా ఈ సంవత్సరం పరీక్షలలో మొత్తం ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ ఏడాది పరీక్షకు మొత్తం 17,80,365 మంది విద్యార్థులు నమోదు చేసుకుని 17,68,968 మంది హాజరు కాగా 2515,07,109 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం 14,96,307 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులవ్వడంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. 2025తో పోలిస్తే మొత్తం ఉత్తీర్ణత శాతంలో ఇది 3.19 శాతం పాయింట్ల తగ్గింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు