గురుగ్రామ్ ఆసుపత్రికి సోనియా గాంధీ.. ఆ వార్తల్లో నిజం లేదన్న కాంగ్రెస్
గురుగ్రామ్ ఆసుపత్రికి సోనియా గాంధీ.. ఆ వార్తల్లో నిజం లేదన్న కాంగ్రెస్
Sonia Gandhi


గురుగ్రామ్, 13 మే (హి.స.)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఇవాళ అస్వస్థతకు గురయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఆమె గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు (రొటీన్ చెకప్) చేయించుకున్నారని, అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారని తెలిపింది. ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

ఈ విషయంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీపీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ రొటీన్ మెడికల్ చెకప్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటికి తిరిగి వచ్చారు అని క్లుప్తంగా తెలిపారు.

79 ఏళ్ల సోనియా గాంధీ ఇటీవల కాలంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో అస్వస్థతగా ఉండటంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు జనవరిలో వాతావరణ కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. గతేడాదిలో కూడా కడుపు సంబంధిత సమస్యలు, ఇతర సాధారణ పరీక్షల కోసం ఆమె పలుమార్లు ఆసుపత్రిలో చేరారు.

రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ, గతంలో ఐదుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండుసార్లు పనిచేసిన ఆమె, ఇప్పటికీ పార్టీ సంస్థాగత, రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande