
విజయనగరం , 15 మే (హి.స.)
గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో దశాబ్దాల కాలంగా రోడ్డు సౌకర్యం లేని భోజరాజపురం గ్రామానికి రూ.2 కోట్లతో 2 కిలోమీటర్ల మేర నిర్మించిన బీటీ రోడ్డును శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఈ గ్రామ ప్రజలు ముందుకు రాలేదు. ఆ సమయంలో కొండపల్లి శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు. గ్రామస్థుల విన్నపం మేరకు రోడ్డును నిర్మించారు. సీఎం చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని కొండపల్లి చెప్పారు. దశాబ్దాల కాలంగా రోడ్డు లేదని, రోడ్డును నిర్మించిన మంత్రి కొండపల్లికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ