
విడపనకల్లు: , 15 మే (హి.స.)
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాజుల మల్లాపురం గ్రామానికి చెందిన పంపన గౌడ్ (62) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని గాజుల మల్లాపురం గ్రామానికి చెందిన పంపన్నగౌడ్ ద్విచక్ర వాహనంపై కరకముక్కల గ్రామానికి వెళుతుండగా.. పాల్తూరు వంక వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పంపనగౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అత్యవసర వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ