
తిరుమల ,15 మే (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ఇన్నోవా కారును విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన పోసన ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ మగేశ్ సుందర్ శుక్రవారం రూ.40 లక్షలు విలువ చేసే టయోటా ఇన్నోవా కారును విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ ఈవో లోకనాథంకు కారు తాళాలను అందించారు. ఈ కార్యక్రమంలో తితిదే డీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ