ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
Collector


మహబూబ్నగర్, 15 మే (హి.స.)

జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ జడ్చర్ల మండలంలోని పత్తి మార్కెట్ యార్డు ను తనిఖీ చేసి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో కలియ తిరిగి మొక్క జొన్న కొనుగోలు లోడింగ్, ఆన్ లోడింగ్, స్టోరేజ్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పి.ఏ.సి.ఎస్, మార్క్ ఫెడ్, సహకార శాఖ అధికారులతో, రైతులతో కలెక్టర్ మాట్లాడారు.

ఇప్పటివరకు ఎన్ని బస్తాలు కొనుగోలు చేశారు, ఇంకా ఎన్ని బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 వేల బస్తాలు కొనుగోలు చేసి మార్కెట్ యార్డ్ లో తాత్కాలికంగా స్టోరేజ్ చేసినట్లు తెలిపారు.

సుమారు 30 వేల బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. వీటికి సీరియల్ నంబర్ ప్రకారం టోకెన్లు జారీ చేసినట్లు, రెండు రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. లోడింగ్, ఆన్ లోడింగ్ త్వరగా పూర్తి చేయుటకు హమాలీలు అదనంగా నియమించినట్లు కలెక్టర్ కు వివరించారు ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేసి మహబూబ్ నగర్ పట్టణంలో మార్క్ ఫెడ్ అధికారులు గుర్తించిన గోదాములకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి, లోడింగ్, ఆన్ లోడింగ్ త్వరగా గావించి గోదాములకు రవాణా చేసేలా బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు చెల్లింపులు త్వరితగతిన జరగేలా చూడాలని సూచించారు. గన్నీ బ్యాగులు కొరత లేకుండా సరఫరా చేయాలని ఆదేశించారు

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande