లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గాయాలు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గాయాలు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గాయాలు


హనుమాన్ జంక్షన్, 15 మే (హి.స.)

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద చెన్నై - కోల్కతా జాతీయ రహదారిపై లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. విజయవాడ నుంచి కాకినాడకు వెళ్తుండగా.. హనుమాన్ జంక్షన్ వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసం కాగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande