ఆళ్లగడ్డలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు 22.వాహనాలు.స్వాధీనం
ఆళ్లగడ్డలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు 22.వాహనాలు.స్వాధీనం
ఆళ్లగడ్డలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు 22.వాహనాలు.స్వాధీనం

ఆళ్లగడ్డ, 16 మే (హి.స.)

ఆళ్లగడ్డ పట్టణంలోని కొట్టాల ప్రాంతంలో ‘వజ్ర ప్రహార్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, పాత నేరస్థులు, రౌడీ షీటర్ల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ తనిఖీల్లో ఆళ్లగడ్డ సీఐలు నాగరాజురావు, బీవీ రమణ, ఆళ్లగడ్డ టౌన్, చాగలమర్రి, ఆళ్లగడ్డ రూరల్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande