
అమరావతి, 16 మే (హి.స.)
=ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డేగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం సైకిల్పై నియోజకవర్గంలో పర్యటించారు. వివిధ కార్యక్రమాలకు సైతం సైకిల్పైనే వెళ్లి పాల్గొన్నారు. తొలుత అశోక్నగర్లోని తన నివాసం నుంచి 2వ డివిజన్లోని గుణదల ప్రాంతానికి వెళ్లారు. అనంతరం రామవరప్పాడు మీదుగా నియోజకవర్గ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం సుమారు 19 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. మధ్యలో చిరు వ్యాపారుల, రిక్షా కార్మికులతో మాట్లాడారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే తాను సైకిల్పై నియోజకవర్గంలో పర్యటించినట్లు ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ