
అనకాపల్లి, ఏప్రిల్ 16, (హి.స)
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఓ యువకుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నక్కపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సికోలు రాజు (22), గొడుగు తామస్, బద్దా పండు, ద్విచక్ర వాహనంపై అడ్డు రోడ్డుపై వెళ్లి, తిరిగి వస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నక్కపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. నక్కపల్లి బస్టాండ్ సమీపంలో మరో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో విజయ్ కుమార్, రాజేష్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను పోలీసులు నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ