
హైదరాబాద్, 16 మే (హి.స.)
మలేషియా నుంచి వస్తున్న అంతర్జాతీయ విమానానికి
(International flight) బాంబు బెదిరింపులు రావడం శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేపింది. విమానాన్ని ఏ క్షణంలోనైనా పేల్చేస్తామంటూ గుర్తుతెలియని దుండగులు బెదిరించడంతో పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులను అప్రమత్తం చేశారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సెక్యూరిటీ సిబ్బంద, బాంబు స్క్వాడ్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి హై అలర్ట్ ప్రకటించాయి.
తీవ్ర ఉత్కంఠ నడుమ ఎయిర్పోర్ట్ అధికారులు (Airport authorities) అన్ని ముందస్తు భద్రత చర్యలు చేపట్టడంతో విమానం శంషాబాద్ రన్వేపై క్షేమంగా ల్యాండ్ (Safe Landing) అయింది. ల్యాండింగ్ పూర్తి కాగానే అత్యవసర నిబంధనల ప్రకారం విమానాన్ని రన్వే నుంచి హుటాహుటిన ప్రత్యేక ఐసోలేషన్ బే (Isolation Bay)కు తరలించారు. భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, విమానం తో పాటు వారి లగేజీని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..