ఇంధన ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి.. మోడీ సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. !
ఇంధన ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి.. మోడీ సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. !
Cm


హైదరాబాద్, 16 మే (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం (Modi Govt)పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు 'విశ్వాస ఘాతుకమని.. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం సామాన్యుల పాలిట పిడుగుపాటు లాంటిదని, ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి ఇంధన ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరిచారని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ముందు ధరలు పెంచబోం అని పదే పదే ప్రకటించిన మోదీ ప్రభుత్వం.. ఫలితాలు వచ్చిన పది రోజులు కూడా గడవక ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికీ ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని, ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకమని ఆయన ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ (Economy of the country) కుదేలైందని, పదేళ్లుగా రూపాయి విలువ పతనం పరాకాష్టకు చేరిందని రేవంత్ ఆరోపించారు. 'ఆత్మనిర్భర్ భారత్' అనేది కేవలం ఓట్లు రాల్చే నినాదం గానే మిగిలిపోయిందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిని యువత ఉపాధి కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని చెప్పుకునే కేంద్రం ఈ పెంపును ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించిన ఆయన, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande