
పెద్దపల్లి, 16 మే (హి.స.)
పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కొనుగోలు పరిస్థితులను, నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద మక్కల లోడింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని సూచించారు. రవాణా పరంగా వాహనాల కొరత సమస్య తలెత్తకుండా చూడాలని, లారీల లభ్యత తక్కువగా ఉన్నచో ప్రత్యామ్నాయంగా స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను ఉపయోగించుకొని మక్కల రవాణా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, రవాణా ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు