సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండించాలి.. అగ్రికల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండించాలి.. అగ్రికల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
Agriculture


కొమురం భీం, 16 మే (హి.స.)

రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ పద్ధతుల ( Organic Crops ) ద్వారా పంటలను పండించాలని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ గౌరీ శంకర్( Gouri Shankar), డాక్టర్ శివలక్ష్మి ( Dr. Shivalakshmi ) రైతులను సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శనివారం కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు.

తక్కువ యూరియా వాడాలని, సాగు ఖర్చుకు తగ్గించాలని సూచించారు. యూరియా వాడకం తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఏటా ఒకే పంట కాకుండా పంటల మార్పిడి ద్వారా భూమి సారవంతం పెరుగుతుందన్నారు. మార్కెట్లో అధిక ధరలున్న పంటలను సాగు చేయాలన్నారు.

సాగునీటి ఆదాయాన్ని భావితరాలకు అందించాలన్నారు. సేంద్రీయ పద్ధతులు పాటించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నారు. జొన్న, పత్తి చీడపీడలు పంటల యజమాన్య పద్ధతులు వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande