చిత్తూరు జిల్లా విజయపురంలో భారీ చోరీ
చిత్తూరు జిల్లా విజయపురంలో భారీ చోరీ
చిత్తూరు జిల్లా విజయపురంలో భారీ చోరీ


విజయపురం: 16 మే (హి.స.)

చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఆలపాకంలో హరీశ్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి వెనుక ఉన్న కిటికీలను చాకచక్యంగా తొలగించి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో బీరువాలో దాచిన 35 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.45వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande