ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి తిరుపతి కలెక్టర్
ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి తిరుపతి కలెక్టర్
/tirupati-district-collector-s-venkateswar-attends-swachh-andhra-pr


తిరుపతి, 16 మే (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పరిసరాల పరిశుభ్రత,ప్రజల భాగస్వామ్యం,పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికి వెళ్ళి క్లాప్ మిత్రాలు రోజు వస్తున్నారా అని ఆరా తీశారు. డ్రైనేజీని పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలను జారీ చేశారు. స్వచ్ఛ రథాన్ని పరిశీలించి, రోజుకు ఎన్ని ఇల్లు కవర్ చేస్తున్నారని, దానిలో ఉన్న నిత్యవసర సరుకులను పరిశీలించారు. క్లాప్ మిత్రాలను సన్మానించి, వారితో కలసి టీత్రాగుతూ కుటుంబ సభ్యులు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

రచ్చబండ దగ్గర కూర్చుని ప్రజలతో మమేకమై గ్రామజీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, ప్రజలకు గన్ని సంచులను పంపిణీ చేసి, అందరిచేత జిల్లా కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు.

ప్లాస్టిక్ రహిత లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యంతో సింగల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించేలా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేసి ముందుకు అడుగులు వెయ్యాలని అన్నారు. ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు ప్రత్యామ్నాయంగా గన్ని, క్లాత్ సంచులు వాడుకోవాలని అన్నారు. ప్రతి గ్రామం, పట్టణ స్థాయిలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వెయ్యాలని, తడి-పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం చెయ్యాలని అన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నిర్వహణను పక్కాగా చేపట్టాలని, ప్రతి ఒక్కరిలో మంచి ఆలోచనతో మార్పు రావాలని అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande