పాలకొల్లు.పట్టణంలో తీవ్ర. తాగునీటి. ఎద్దడి
భీమవరం,17 మే (హి.స.) :పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఉన్నతాధికారులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసు
పాలకొల్లు.పట్టణంలో తీవ్ర. తాగునీటి. ఎద్దడి


భీమవరం,17 మే (హి.స.) :పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఉన్నతాధికారులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఉదయం మున్సిపల్ వాటర్ వర్క్స్కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. చెరువుల్లో ప్రస్తుత నీటి పరిమాణం.. ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయవచ్చో మంత్రి నిమ్మల రామానాయుడు అంచనా వేశారు.

రానున్న రోజుల్లో ప్రజలకు తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మరో వైపు యుద్ధ ప్రాతిపదికన బోరు బావి తవ్వకాలు చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. మంచినీటి చెరువు వద్దే ఉంటూ ప్రజలకు తాగు నీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఉద్యోగులకు ఆయన అప్పటికప్పుడు కీలక ఆదేశాలు ఇస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande