
విజయవాడ, , 17 మే (హి.స.)
:విజయవాడలో ఎండీఎం ఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు జరిపిన సోదాల్లో షైతన్, మంగీలాల్ అనే ఇద్దరు యువకుల నుంచి సుమారు 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా విజయవాడ వన్టౌన్ పోలీసులు వారిని పట్టుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?, ఇంకా ఎవరెవరికి సరఫరా చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ