నంద్యాల జిల్లా.ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు.ప్రమాదం
నంద్యాల, 17 మే (హి.స.):నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ (JBT) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికు
నంద్యాల జిల్లా.ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు.ప్రమాదం


నంద్యాల, 17 మే (హి.స.):నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ (JBT) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచలం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలు దేరింది. ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సమీపంలో నిదానంగా వెళ్తున్న బొగ్గు లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు ఢీకొంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా సుగంకు చెందిన సుబ్రహ్మణ్యం (50) ప్రయాణికుడు మృతిచెందారు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా? లేక ఇతర సాంకేతిక సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

మరో ఘటనలో.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఓ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వ్యాన్డ్రైవర్ మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి గోపాలపురం పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande