
హైదరాబాద్, 17 మే (హి.స.)
: కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్లిన ఓ కారు.. డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ