కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన
కాకినాడ, 17 మే (హి.స.) జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్
కాకినాడ జిల్లా కిర్లంపూడి  మండలం  గోనేడు గ్రామంలో విషాద ఘటన


కాకినాడ, 17 మే (హి.స.) జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మి వివాహం ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన జరిగింది. అయితే వివాహం జరిగి నెలరోజులు కూడా గడవకముందే ఆమె మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వెంకటలక్ష్మి ఆత్మహత్యకు భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత నుంచి మానసికంగా వేధింపులకు గురిచేశారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. నవవధువు మృతి ఘటనతో గోనేడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande