నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
acc


నంద్యాల, 17 మే (హి.స.)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచలం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలు దేరింది. ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీని దాటే క్రమంలో బస్సు ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా? లేక ఇతర సాంకేతిక సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande