బండి భగీరథ్ పోక్సో కేసు అప్డేట్.. మరో సిట్ ఏర్పాటు
హైదరాబాద్, 19 మే (హి.స.) తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసు (Bandi Bhagirath POCSO case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెన అనుచిత పోస్టులను దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ (Sit) ఏర్
Bhagirath


హైదరాబాద్, 19 మే (హి.స.)

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా

మారిన బండి భగీరథ్ పోక్సో కేసు (Bandi Bhagirath POCSO case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెన అనుచిత పోస్టులను దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ (Sit) ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాని నిందితుడు దామోదర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇదే వ్యవహారంలో మరికొందరిపై కేసులు నమోదు చేసింది. వీటిని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత (CP Shweta) ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బండి భగీరథ్కు పోక్సో (POCSO) కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవుని లక్ష్యంగా(Justice T. Madhavi Devi) చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్ర కలకలం రేపింది.

బండి భగీరథ్కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే.. దానికి ప్రతిఫలంగా జడ్జి మాధవి దేవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ కొన్ని ఐటీ సెల్, సోషల్ మీడియా వేదికల్లో అనుచిత ఆరోపణలతో కూడిన పోస్టులను సర్క్యులేట్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కేసు విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవి దేవి ఈ పోస్టులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఘం నేతలు కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు సదరు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం కీలక పరిణామం గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande