కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పౌరసత్వ నిబంధనల్లో సవరణలు
హైదరాబాద్, 19 మే (హి.స.) కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ నిబంధనల సవరణ చట్టం (Citizenship Amendment Rules, 2026) కు సంబంధించి ఒక కీలక నోటిఫికేషనన్ను జారీ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చి భారతదేశ పౌరసత్వం కోసం ద
సిటిజన్షిప్


హైదరాబాద్, 19 మే (హి.స.)

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ నిబంధనల

సవరణ చట్టం (Citizenship Amendment Rules, 2026) కు సంబంధించి ఒక కీలక నోటిఫికేషనన్ను జారీ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చి భారతదేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం కొత్తగా 'పాస్పోర్ట్ ' డిక్లరేషన్ నిబంధనను (Passport Declaration) కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ సవరణ తో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వలసదారులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ 'పాస్పోర్ట్ స్థితి' (Passport Status) ని ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది.

అలాగే దరఖాస్తుదారుల వద్ద ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే (Valid) పాత పాస్ పోర్ట్ ఉంటే, దానికి సంబంధించిన నంబర్, జారీ చేసిన తేదీ, స్థలం, గడువు వివరాలను దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకవేళ లేకపోతే, తమ వద్ద వాలిడ్, గడువు ముగిసిన (Expired) పాస్పోర్ట్ ఏదీ లేదని స్పష్టం చేయాలి. భారత పౌరసత్వానికి అనుమతి (Approval) లభించిన 15 రోజుల్లోగా దరఖాస్తుదారులు తమ పాత దేశానికి చెందిన పాస్ పోర్టులను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్కు అప్పగించాల్సి (Surrender) ఉంటుంది.

ఒకే వ్యక్తికి రెండు దేశాల పౌరసత్వం (Dual Nationality) ఉండకుండా నిరోధించడమే ఈ సరెండర్ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశంగా కేంద్ర స్పష్టం చేసింది. పౌరసత్వ నిబంధనలు-2009 లోని షెడ్యూల్ IC కింద తెచ్చిన ఈ కొత్త మార్పులు.. మూడు పొరుగు దేశాల నుండి మతపరమైన వేధింపుల వల్ల భారత్కు వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవ మైనారిటీ వర్గాల దరఖాస్తుల పరిశీలనను మరింత పటిష్టం చేస్తాయని కేంద్ర భావిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande