తీర ప్రాంత భద్రత పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం
తీర ప్రాంత భద్రత పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం
తీర ప్రాంత భద్రత పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం


నెల్లూరు,:, 19 మే (హి.స.)

ఏపీ సముద్ర తీర ప్రాంత ఆదేశించారు భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఆదేశించారు. సముద్రంలో నిరంతర గస్తీ కోసం పలు శాఖల అధికారులు, స్థానిక మత్స్యకారులతో సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరు సముద్ర తీరంలో నిరంతర గస్తీ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టాస్క్ఫోర్స్ పెట్రోలింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. డ్రోన్ల ద్వారా గస్తీ నిర్వహిస్తూ, హెచ్చరికలు జారీ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు ప్రదర్శించారు. తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల కదలికలపై శాటిలైట్ చిత్రాల సాయం తీసుకోవాలని ఆదేశించారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా ఫిష్ సీడ్ ఉత్పత్తిని పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande