
నాగర్ కర్నూల్, 19 మే (హి.స.)
సాగు నీటి అభివృద్ధికి ఫీడర్ చానల్
పనులు కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతంగా చేయాలన్నారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్ గ్రామ పరిధిలో నాపగుంపు నుంచి పెద్దకుంట వరకు కొనసాగుతున్న ఉపాధి హామీ ఫీడర్ ఛానల్ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యత, కూలీల హాజరు వివరాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ పనిస్థలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ఆత్మీయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వారి
ఇల్లు లేని అర్హులైన వారికి గృహాలు మంజూరు చేయాలని, గ్రామీణ పేదల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, వారికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. కూలీలకు వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కొంతమంది కూలీలకు ఐసీఐసీఐ బ్యాంక్, గద్వాల బ్యాంకుల నుంచి చెల్లింపులు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే బ్యాంక్ మేనేజర్ను పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పనుల పురోగతి, ప్రణాళికలు, గ్రామ ప్రజలకు అందించనున్న తాగునీటి సదుపాయాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో జల్ జీవన్ మిషన్ పనులు కీలకమని పేర్కొంటూ, పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పనుల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు