రోడ్డెక్కిన రైతులు.. వరి ధాన్యం బస్తాలకి నిప్పు
రోడ్డెక్కిన రైతులు.. వరి ధాన్యం బస్తాలకి నిప్పు
Farmers


వనపర్తి, 19 మే (హి.స.)

వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినావరి ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుతో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం విషయంలో తన మొండివైఖరిని విడలని రైతులు కోరుతున్నారు. వనపర్తి మండలం రాజపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్లే రోడ్డుపై వరి ధాన్యం పోసి ధాన్యానికి నిప్పు పెట్టి ధర్నా నిర్వహించిన రైతులు.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. అనంతరం రాజపేట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం బస్తాలను రోడ్డు పైకి తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande