
న్యూఢిల్లీ, 19 మే (హి.స.)
భారతదేశపు బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్న వేళ, ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు (MAHSR) చిత్రాన్ని రైల్వే మంత్రిత్వశాఖ గేట్ నంబర్ 4 వద్ద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఎంఏహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టు (508కి.మీ) జపాన్ సాంకేతికత, ఆర్థిక సాయంతో నిర్మాణ దశలో ఉంది. ఈ ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. దీనికోసం ముంబయి, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతిల్లో 12 స్టేషన్లు ప్లాన్ చేశారు. కాగా, దేశంలోని మొదటి బుల్లెట్ రైలును ఈ ఏడాది సూరత్-బిలిమోరా మధ్య ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi