స్వర్ణకారుల రోడ్డు రోల్లా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసన
స్వర్ణకారుల రోడ్డు రోల్లా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసన
gold-smiths-protest-pm-modi-comments-on-gold-purchase-jaya-nag


ఎమ్మిగనూరు, 19 మే (హి.స.): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఆందోళన దిగారు.బంగారం కొనుగోళ్లను కొంతకాలం పాటు నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా స్వర్ణకారులు, ఆభరణాల తయారీ కార్మికులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు。 ఈ నిర్ణయం వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని, తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నారు

బంగారు కొనడం పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర సంఘం పిలుపుతో బంద్ పాటిస్తూన్నారు. శరాఫ్ బజార్ లో ర్యాలీ నిర్వహించారు.

నోట్ల రద్దు,కరోనా సమయంలో భారీగా నష్టపోయామని రెడీమేడ్ ఆభరణాల వల్లా ఉపాధి తగ్గిందని ఈ నేపథ్యంలో ప్రధాని ఏడాది పాటు బంగారు కొనవద్దు అనడం సరికాదన్నారు.తమ ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి వాట్స్ అప్ ద్వారా వినతిపత్రం పంపారు

ఇప్పటికే విపరీతంగా పెరిగిన బంగారం ధరలు మరియు దిగుమతి సుంకాల పెంపు కారణంగా మార్కెట్లో కొనుగోళ్లు తగ్గిపోయాయి。 దీనికి తోడు ప్రధాని చేసిన ప్రకటన తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసిందని స్వర్ణకారులు ఆవేదన చెందుతున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande