మమతా బెనర్జీకి షాక్.. ఉపఎన్నిక బరిలో చేతులెత్తేసిన సొంత పార్టీ నేత జహంగీర్
మమతా బెనర్జీకి షాక్.. ఉపఎన్నిక బరిలో చేతులెత్తేసిన సొంత పార్టీ నేత జహంగీర్
Mamata banerjee


కలకత్తా, 19 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్కు కేవలం రెండు రోజుల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన జహంగీర్ ఖాన్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తాను ఈ ఉపఎన్నికలో పోటీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

మమతా బెనర్జీ మేనల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్సభ పరిధిలోకి వచ్చే ఈ ఫాల్తా నియోజకవర్గ ప్రచారంలో టీఎంసీ అగ్రనేతలు ఎవరూ పెద్దగా పాల్గొనకపోవడం అప్పట్లోనే పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఎందుకు తప్పుకొన్నారనేది ఆసక్తికరంగా మారింది. కారణాలను మాత్రం ఆయన అధికారికంగా వెల్లడించలేదు.

బెంగాల్లోని 293 స్థానాల అసెంబ్లీ ఫలితాలు మే 4నే విడుదలయ్యాయి. అయితే ఫాల్తా నియోజకవర్గంలో మాత్రం పోలింగ్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బటన్ ఉన్నచోట స్టికర్ వేసినట్లుగా ప్రచారం జరిగింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం విచారణ జరిపి రీపోలింగ్కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలింగ్కు రెండ్రోజుల ముందు టీఎంసీ అభ్యర్థి చేతులెత్తేయడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande