భారత్లో లేని ఎయిర్బేస్లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి
భారత్లో లేని ఎయిర్బేస్లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి
Operation Sindoor


పహల్గామ్, 19 మే (హి.స.)

గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా పాకిస్థాన్, భారత నగరాలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ మరియు క్షిపణి దాడుల జరిపిందనీ,. 'ఆపరేషన్ బున్యాన్ ఉల్ మార్సూస్' పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో కనీసం 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొంటూ. పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నామని ఆయన తెలిపారు. కానీ మన దేశంలో ఆ పేరుతో ఎయిర్బేస్లు లేకపోవడం గమనార్హం. భారత్లోని రాజౌరీ, మామూన్ ఎయిర్ బేస్లను తమ క్షిపణులు తాకాయని ఆయన చెప్పారు. ఆయన పేర్కొన్న ప్రాంతాల్లో ఎయిర్ బేస్లు లేవనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు.

రాజౌరీ జమ్ముకశ్మీర్లోని ఒక జిల్లా కాగా, అక్కడ భారత వైమానిక దళ ఎయిర్ బేస్ లేదు. మామూన్ పంజాబ్లోని పఠాన్కోట్ సమీపంలో ఉన్న ఒక కంటోన్మెంట్ ప్రాంతం. ఈ విషయాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande