ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్...కనిపించకుండా పోయిన ఏపీఎం
ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్...కనిపించకుండా పోయిన ఏపీఎం
ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్...కనిపించకుండా పోయిన ఏపీఎం


ఎన్టీఆర్ జిల్లా, 20 మే (హి.స.)చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్థాపంతో చనిపోతున్నానని సెల్ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మొహమ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ మండలంలో ఏపీఎం(అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్)గా గంధం చంద్రశేఖర్ పని చేస్తున్నారు. గొల్లపూడి క్లస్టర్లో ఎంఎస్సీసీ.. ఎస్బీఐ గొల్లపూడి బ్రాంచ్తో పాటు ఇతర బ్యాంకుల్లో ఫేక్ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి లోన్లు ఇప్పించి, అందిన చోట డబ్బులు వసూలు చేశారని ప్రాజెక్ట్ డైరెక్టర్కు చంద్రశేఖర్ లేఖ రాశారు.

తన పాత్ర ఏమీ లేకపోయినా తనను సస్పెండ్ చేశారని, ఎనిమిది నెలలుగా కొత్త పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసినా ఎవరూ న్యాయం చేయలేదని చంద్రశేఖర్ ఆరోపించారు. సూసైడ్ చేసుకుంటానని మెసేజ్ పంపి చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు. చంద్రశేఖర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande