
అమరావతి, 20 మే (హి.స.)అలిపిరి కాలినడక మార్గంలో బుధవారం భారీ కొండ చిలువ పట్టుబడింది. నడక మార్గంలోని మోకాళ్ల పర్వతం సమీపంలోని మెట్లవైపు సుమారు 12 అడుగుల పొడవైన కొండ చిలువ వచ్చింది. దాన్ని చూసిన భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. కొండచిలువ పట్టుబడడంతో కాలినడకన తిరుమల చేరుకునేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా ఇలాంటి పాములు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ