
అమరావతి, 20 మే (హి.స.)
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్( )తెలిపారు. ఈరోజు (బుధవారం) ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది. ఏపీలో అమలవుతున్న ఉత్తమ ఎన్నారై పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఏపీలో తెలంగాణ కమిటీ పర్యటిస్తోంది. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమంపై ఏపీలో అమలవుతున్న పద్ధతులపై తెలంగాణ కమిటీ అధ్యయనం చేస్తోంది.
క్షేత్రస్థాయిలో ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయక చర్యలను తెలంగాణ బృందం పరిశీలించింది. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, నకిలీ ఏజెంట్లపై ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ తీసుకుంటున్న చట్టపరమైన చర్యలపై చర్చించారు. గల్ఫ్ వలసదారుల భద్రత, బీమా సౌకర్యాలు, స్వదేశానికి తిరిగి వచ్చిన వారి కోసం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై అధికారులను అడిగి తెలంగాణ సభ్యులు తెలుసుకున్నారు. ఏపీఎన్ఆర్టీ విధానాలపై అక్కడి ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ సభ్యులు ఓ నివేదిక ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ