పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలి.. ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, 20 మే (హి.స.) పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషనన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్య
ఎస్పీ రోహిత్ రాజ్


భద్రాద్రి కొత్తగూడెం, 20 మే (హి.స.)

పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషనన్ను

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీలో భాగంగా స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలో బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా స్టేషన్ భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును ఎస్పీ పరిశీలించారు.

స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. క్రమశిక్షణతో పనిచేస్తూ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande