దేశీయ క్యాన్సర్ మందులు పక్కదారి.. కేంద్రం, డీఆర్ఎ (DRI)కి ఢిల్లీ హై కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, 20 మే (హి.స.) దేశీయ క్యాన్సర్ మందులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేవలం దేశంలోని స్థానిక అవసరాల కోసమే ఉద్దేశించిన ప్రాణాలను రక్షించే క్యాన్సర్ (Oncology) తదితర అత్యవసర ఔషధాలను అక్రమంగా పక్కదారి
Delhi High court


న్యూఢిల్లీ, 20 మే (హి.స.)

దేశీయ క్యాన్సర్ మందులు పక్కదారి

పడుతున్నాయనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేవలం దేశంలోని స్థానిక అవసరాల కోసమే ఉద్దేశించిన ప్రాణాలను రక్షించే క్యాన్సర్ (Oncology) తదితర అత్యవసర ఔషధాలను అక్రమంగా పక్కదారి పట్టించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) విచారించి.. కేంద్ర ప్రభుత్వంతో పాటు సీడీఎస్సీఓ (CDSCO), డీజీఎఫ్తా (DGFT), కస్టమ్స్ (CBIC), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) లకు అత్యవసర నోటీసులు జారీ చేసింది.

దేశీయ మార్కెట్లోనే విక్రయించాలనే కఠినమైన నిబంధన కలిగిన For Sale in India Only లేబుల్ గల అత్యంత ఖరీదైన క్యాన్సర్ మందులను, కొన్ని ఎగుమతి సంస్థలు (Merchant Exporters) ఇక్కడి స్థానిక మార్కెట్ నుండి అక్రమంగా సేకరించి, ఇతర అనుమతించబడిన కన్సైన్మెంట్లతో కలిపేసి విదేశాలకు తరలిస్తున్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ భారీ దందా వెనుక ఉన్న పెద్ద నెట్వర్కు, సరఫరా గొలుసును ఛేదించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు కేంద్రం, డీఆర్ఎ (DRI) అత్యవసర నోటీసులు జారీ చేయడం కీలక పరిణామం గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande