ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
రాజన్న సిరిసిల్ల, 20 మే (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -సిద్దిపేట రోడ్డు పై రైతులు బైఠాయించి వరిధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని బుధవారం ధర్నా చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి గత 45
Farmer


రాజన్న సిరిసిల్ల, 20 మే (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -సిద్దిపేట రోడ్డు పై రైతులు బైఠాయించి వరిధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని బుధవారం ధర్నా చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి గత 45 రోజులుగా ఎంత గోసా పడుతున్నామని, ఆ గోస ఆ దేవుడికే తెలవాలని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, గన్ని సంచుల కొరత, హమాలీల కొరత, రవాణా సమస్య, రైస్ మిల్లులో ఆన్ లోడింగ్ తదితర సమస్యలను మొత్తం రైతులపై రుద్దుతున్నారని, మరి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande