అమెరికాలో జరిగిన .రోడ్ ప్రమాదంలో బాపట్ల.కు.చెందిన సాఫ్ట్వేర్ మృతి
అమెరికాలో జరిగిన .రోడ్ ప్రమాదంలో బాపట్ల.కు.చెందిన సాఫ్ట్వేర్ మృతి
అమెరికాలో జరిగిన .రోడ్ ప్రమాదంలో  బాపట్ల.కు.చెందిన సాఫ్ట్వేర్ మృతి


బాపట్ల 20 మే (హి.స.)

అమెరికాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. బాపట్ల కొత్త బస్టాండ్ దగ్గర నివాసం ఉంటున్న ఆవుల శ్రీనివాసరావు పెద్దకుమారుడు ఆవుల పూర్ణగోపి (35) అమెరికాలోని న్యూ మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ఇటీవల ఆయన చిన్న కుమారుడు, భార్యతో కలిసి అమెరికాకు వెళ్ళాడు. మంగళవారం పూర్ణగోపి తన కారులో కుటుంబంతో కలిసి వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరొక వాహనం ఢీకొట్టింది. దీంతో పూర్ణగోపి మృతి చెందగా, తండ్రి శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడి తల్లికి, తమ్ముడికి గాయాలు అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande