కుల గణన పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రక మైనది. వి హనుమంతరావు
హైదరాబాద్, 20 మే (హి.స.) కులగణన (Caste Census Verdict) విషయంలో సుప్రీం కోర్ట్ (Supreme Court) ఇచ్చిన కీలక తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantha Rao) అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని
VH


హైదరాబాద్, 20 మే (హి.స.)

కులగణన (Caste Census Verdict) విషయంలో సుప్రీం కోర్ట్

(Supreme Court) ఇచ్చిన కీలక తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantha Rao) అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని ఈ తీర్పు ఇచ్చినందుకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 60 కోట్ల ప్రజలకు న్యాయం చేసిన జస్టిస్ సూర్యకాంత్కు రుణపడి ఉంటామన్నారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేశారని రేవంత్ ప్రభుత్వం కులగణన చేసిందని గుర్తు చేశారు. బీసీలు ఎదగడం మోడీజీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదన్నారు. కాగా జనగణనలో కులగణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయం అని వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై వీహెచ్ స్పందించారు. మోడీ మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మాకు అన్ని విషయాలు తెలుసన్నారు. 18వ శతాబ్దంలోనే జ్యోతిరావ్ ఫూలే మాకు అన్ని నేర్పారని చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు ఇంధన ధరలు పెంచారు. డీమానిటైజేషన్ వల్ల దేశ ప్రజలు రోడ్లమీదకు వచ్చారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande