స్టేషన్ ఉన్నా.. ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపాయే..
స్టేషన్ ఉన్నా.. ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపాయే..
residents-demand-express-train-stops-at-mudigubba-railway-stat


ముదిగుబ్బ(అనంతపురం), 20 మే (హి.స.) అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉన్నా.. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాలంటే దూరంలోనున్న ధర్మవరం, కదిరికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ధర్మవరం నుంచి పాకాలకు డబుల్లైన్ ఏర్పాటైతే రైళ్ల రాకపోకలు మరింత పెరుగుతాయి. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు కొత్త రైలు మార్గం ఏర్పాటు చేస్తే జంక్షన్గా మారుతుంది. అభివృద్ధికి ఎంతో కీలకమైన ముదిగుబ్బలో నేటికీ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపకపోవడం శోచనీయం.

ధర్మవరం-నర్సాపూర్, గుంతకల్లు-తిరుపతి మాత్రమే ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ-మధురై ఎక్స్ప్రెస్ (22716), సికింద్రబాద్-తిరుపతి(12769), సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్, కాచిగూడ-తిరుపతి(12765) అమరావతి ఎక్స్ప్రెస్, ముంబై-నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్(16340) రైళ్లు వారానికి రెండుసార్లు ముదిగుబ్బ మీదుగా వెళ్తున్నాయి. ముదిగుబ్బ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్యాసింజర్ రైళ్లు ఉన్నా వచ్చి వెళ్లేందుకు సమయాల్లో మార్పు ఉండడంతో ఉపయోగం లేకుండా పోతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande