

మంత్రాలయం, 21 మే (హి.స.): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో గురు రాయర శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఈ రోజు గురువారం భక్తుల సందడి నెలకొంది.
గురువారం రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాల తమిళునాడు, కేరళం . పుదుచేరి, మరియు కర్నాటక నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, మధ్వమార్గ్ కారిడార్, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠం పీఠాధిపతి పూర్ణ భోధ పూజ మందిరంలో మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళ వాయిద్యాల మధ్య నవరత్నాల రథంపై ఊరేగించారు.
శ్రీ విద్యావల్లభ తీర్థ స్వామీజీ మంత్రాలయాన్ని సందర్శించారు. శ్రీక్షేత్ర మంత్రాలయంలో హెచ్.హెచ్.శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీ స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. పర్యటన సందర్భంగా శ్రీ స్వామీజీ శ్రీ రాఘవేంద్ర స్వామి మరియు శ్రీ వదీంద్ర తీర్థుల దర్శనం చేసుకున్నారు. అనంతరం హెచ్.హెచ్.శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ హెచ్.హెచ్.శ్రీ విద్యావల్లభ తీర్థ స్వామీజీని ఘనంగా సత్కరించారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు మఠం పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV