
కాళేశ్వరం 21 మే (హి.స.)దక్షిణకాశీగా భాసిల్లుతున్న కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమ తీరాన సరస్వతీ అంత్య పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5.43 గంటలకు అంత్య పుష్కరాలను కంచికామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, మంత్రి శ్రీధర్బాబు లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించే సరస్వతీ పుష్కర ఏర్పాట్లతో త్రివేణి సంగమం కాంతులీనుతోంది. పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.
త్రివేణి సంగమ తీరమైన కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ అంత్యపుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమంలో నేటి నుంచి నుంచి జూన్ 1 వరకు జరగనున్న అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతేడాది జరిగిన ఆది పుష్కరాల మాదిరిగానే అంత్య పుష్కరాలకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు దాదాపు 30 లక్షలమంది వరకు హాజరవుతారని అంచనా వేసిన ప్రభుత్వం భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi