ఏపీపీజీసెట్-2026.ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల .విడుదల
ఏపీపీజీసెట్-2026.ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల .విడుదల
ఏపీపీజీసెట్-2026.ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల .విడుదల


అమరావతి, 29 మే (హి.స.)

| : ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. మే 8 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తంగా 19,118మంది దరఖాస్తు చేసుకోగా.. 16,406 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,020 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో 30 సబ్జెక్టులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ ఏడాది పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అందరికీ మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన ఉత్తీర్ణత శాతం విజేతల కృషి, పట్టుదలకు నిదర్శనమన్నారు. విజయం సాధించిన ప్రతి అభ్యర్థికీ ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా ఆకాక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande